నమస్తే నా పేరు అశోక్ ప్రస్తుతం అనంతపూర్ లో నివసిస్తున్నాను. నేను మల్టీమీడియా కంప్లీట్ చేసి బెంగుళూరు లో జాబు చేసే వాడిని. నా చిన్నప్పటి రోజులన్నీ కడప జిల్లా లోని ఒక మారు మూల పల్లెలో గడిచాయి. అప్పటి రోజులలో పంటలు బాగా పండి వ్యవసాయానికి మనిషి బతకడానికి ఏ లోటు లేకుండా గడిచిపోయేవి. ప్రతి ఇంట్లో పాడి పశువులు ఉండేవి. నా ఐదవ తరగతిలో మేము మా ఊరు విడిచిపెట్టి అనంతపురం వచ్చేసాము. కిందటి యేడాది నేను మా ఊరు వెళ్ళాను. పల్లెలు మారి పోయాయి అని విన్నాను తప్ప మరి ఇంత దారుణంగా మారాయి అనుకోలేదు. వర్షాలు లేవు పంటలు లేవు పాడి లేదు.
ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఆవు లేదు. అవి మేయడానికి గడ్డి లేదు. ఇష్టం లేకుండానే వాటిని చాల మంది మాంసానికి అమ్మేసారు. చాల బాదేసింది పురాణాలలో వేదాలలో ఋషులు మునులు దేవతలు ఆవు కి ఇచ్చిన విలువ ఇక ఏ జంతువు కి ఇవ్వలేదు. ఆవుని విశ్వమాత గ పూజించారు. అలాంటి ఆవు ఈ రోజు మా ఉరి మొత్తం మీద ఒకటి కూడా లేదు. బతుకు తెరువు కోసం చాలామంది ఉరి విడిచి వెళ్లారు. కాని అవి మనం లేకుండా బతకలేవు కదా అందుకేనేమో అన్నిటిని చంపేశారు.
బెంగుళూరు తిరిగి వెళ్ళిపోయాను కాని నా ఆలోచనలు అన్నీ మా ఊరి మీదే ఉండిపోయాయి. అంతకంటే ఎక్కువ పశువుల మీద. ఆలోచించాను పశువులను ఎలాగయినా కాపాడాలి అని అనుకున్నాను. అందుకే న జాబ్ వదిలేసి అనంతపూర్ వచ్చేసాను. గోసదన్ అనే ట్రస్ట్ ఓపెన్ చేశాను. కాని ఏ పని మెదలవాలన్న డబ్బు తో ముడిపడి ఉంటుందన్న విషయం తెల్సుకున్నాను. నాది మిడిల్ క్లాసు ఫ్యామిలీ సో సపోర్ట్ అయితే ఇవ్వగలం కానీ డబ్బులు ఇవ్వలేం అన్నారు. అందుకే ఫండ్స్ రూపం లో ట్రస్ట్ ని రన్ చేయాలనుకుంటున్నాను.
దయచేసి మీరు అర్థం చేసుకొని నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను.