గో తులాబారం

పరబ్రహ్మా తత్వాలు మనకు కొన్ని జాబితాలుగా ఉన్నాయి. 

 

- జలం
- అగ్ని
- వాయువు
- రస లింగం (పాదరసం తో చేసింది).
- హిరణ్య లింగం (బంగారంతో చేసింది).
- దారుముర్తి (కొయ్యతో చేయబడినటువంటి భగవత్ స్వరూపం).
- శిలా మూర్తి (శిల తో చెక్కబడినటువంటి భగవాన్ మూర్తి ).
- పరమ ఈశ్వర భక్తుడు ( గోవు ).

ఇలా ఇచ్చిన  జాబితాలో మనం కొన్నిటికి తులా భారం వేయలేము కొన్నిటికి వేయకూడదు.

        పంచ భూతలయిన   అగ్ని , వాయువు , నీరు , ఆకాశం , భూమి  ఇవన్ని భగవత్ స్వరుపలె కాని వీటిలో దేన్నీ మనం తులబారం వేయలేము. ఇక రస లింగం , హిరణ్య లింగం , దారుముర్తి , శీలా మూర్తి  వీటిని మనం తులబారం వేయకూడదు.

         తులా భారం వేయడానికి యోగ్యమయిన ఒకే ఒక్క పరబ్రహ్మాతత్వ  సంబంధమయిన పదార్థం గోవు ఒక్కటే. అందుకే జన్మ జన్మాంతర సుకృతం గోవుకి తులా భారం వేయడం.

పచ్చి గడ్డి , బెల్లం, ఎండు గడ్డి, తవుడు ఇలాంటివి వేసి ఆ పదార్థాన్ని గోశాలకు దానంగా ఇచ్చేయాలి.

గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆయా గ్రహములకు సంబంధించిన ధాన్యాన్ని దానం చేయాలో  అలాంటి ధాన్యం తో తులబారం వేయాలి.

 ఉదా :- రవికి దోషం ఉంటె గోదుమలు .
           శనికి దోషం ఉంటె నల్ల నువ్వులు.
           కేతువుకి దోషం ఉంటె మినుములు.
           రహువుకి దోషం ఉంటె ఉలవలు.

వీటిని గోవు ప్రతి రోజు దానాలో వేస్తే గోవు తిన్నది అంటే 33 కోట్ల దేవతలు తినట్లే అంత అపురూపమయింది ఈ గోవు.